ముందస్తు ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 105మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించినప్పటి నుంచి ఆ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తొలి ప్రాధాన్యత అని పేర్కొన్న కేసీఆర్ తన విషయంలో మాత్రం ఎందుకు అన్యాయం చేశారని చెన్నూర్ తాజా మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆవేదన వ్యక్తం చేశారు. చెన్నూర్ టికెట్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌కు కేటాయించడంపై అధిష్టానంపై నిరసన గళం తీవ్రం చేశారు.