వేగంగా వెళ్లే రైలు కిందపడినా.. 

చావు నోట్లో తల పెట్టి బయటపడటం అంటే ఇదేనేమో. ప్రమాదవశాత్తూ వేగంగా వెళ్లే రైలు కిందపడినా చిన్నగాయంకూడా లేకుండా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. మహారాష్ట్రలోని అసన్‌గాన్‌ రైల్వేస్టేషన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. పట్టాలగుండా రైల్వే ప్లాట్‌ఫామ్‌ దాటడానికి ఓ ప్రయాణికుడు భావించాడు. అదే సమయంలో ఆ రైల్వేస్టేషన్‌లో స్టాప్‌లేని ఓ రైలు వేగంగా దూసుకొచ్చింది. ఏం చేయాలో తెలియక ఆ వ్యక్తి ఫ్లాట్‌ఫామ్‌కు పట్టాలకు మధ్యలో ఉన్న చిన్న స్థలంలో పడుకున్నాడు. కనీసం బ్రేకులు కూడా వేయకుండా ట్రైన్‌ అదే స్పీడుతో వెళ్లిపోయింది.

స్టేషన్‌లో ఉన్న వారందరూ ఇక అతని పని అయిపోయిందని భావించారు. కానీ, ట్రైన్‌ వెళ్లాక నిధానంగా ఆ వ్యక్తి లేచి ఎంచక్కా పట్టాలు దాటుకుంటూ వెళ్లిపోయాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top