ప్రేమించిన భార్య వదిలేసి వెళితే ఎవరికైనా బాధే. యవ్వనంలో ఉంటే ఆ బాధ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి బాధను తట్టుకోవడం అందరి వల్లా కాదు. బాధతో తల్లడిల్లుతూ జీవితాంతం కుంగిపోతూ కృషించిపోయే వాళ్లు కొందరైతే, జీవితానికి ఎదురీది భార్యకన్నా బతుకు ముఖ్యమనుకొని జీవితంలో మరింతగా రాణించేవారు మరికొందరు. భార్యలేని జీవితం తనకెందుకని అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకునే పిరికివారు కూడా ఉంటారు. కానీ రష్యాలోని పీటర్స్బర్గ్కు చెందిన 31 ఏళ్ల ఆర్సే వలీవ్ ఈ కోవల్లో దేనికి చెందిన వాడు కాదు. 20 ఏళ్లుగా భయంకర విషపూరిత పాములతోని, మనుషులను తినే అడవి పిల్లులతోని ఆడుకునే వాడు. వాటి పట్ల ఉన్న ప్రేమతోనే ఆయన కొంతకాలం జంతుప్రదర్శన శాలలో పనిచేశాడు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి స్వస్తి చెప్పి యూట్యూబ్లో పలు ఛానళ్ల నిర్వహించడం ద్వారా లక్షలాది అభిమానులను కూడగట్టుకున్నాడు. ఆయనకు భార్య ఏక్తరీనా కాత్యా అంటే కూడా చాలా ఇష్టమే. ఇద్దరూ యూట్యూబ్ ఛానళ్లలో తమ పెంపుడు పాములు, పిల్లులతో కనిపిస్తూ అల్లరిచేసే వారు. పాములతో ఆడుకోవడమూ, వాటికి సంబంధించిన విశేషాలు చెప్పడం ఇద్దరికీ ఇష్టమే. వారి మధ్య ఈ మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి.
విషాదం: భార్యతో బ్రేకప్.. లైవ్లో పాముకాటుతో..
Sep 27 2017 6:32 PM | Updated on Mar 21 2024 8:47 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement