మహారాష్ట్రను పర్యాటక అభివృద్ధి కేంద్రంగా మార్చి ఆదాయం పెంపునకు అన్ని మార్గాల్లో ప్రయత్నించనున్నట్లు ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, రాష్ట్ర పర్యావరణం, పర్యాటక శాఖ మంత్రిగా నియమితుడైన ఆదిత్య ఠాక్రే తెలిపారు. ఠాక్రేల కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి ఓర్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచిన ఆదిత్య.. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన ప్రభుత్వంలో చోటు దక్కించుకున్నారు.