లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపరాదు.. ప్రతి వాహనదారుడూ అన్ని రికార్డులూ కలిగి ఉండాలి.. వాహనదారుల ప్రయోజనార్థం గ్రామ స్థాయిలో లైసెన్స్ మేళాలు నిర్వహిస్తున్నాం.. ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, పాలకులు ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. ఆచరణలో లైసెన్సు మేళాతో ఎవరికి మేలు జరుగుతోందని వాహనదారులు చర్చించుకుంటున్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని సేవలు అని చెప్పే అధికారులు వాహనదారుల నుంచి దరఖాస్తులు తీసుకొని ముళ్ల కంపల్లో పడేయడం విమర్శలకు తావిస్తోంది. ముదిగుబ్బ మండలంలోని గుంజేపల్లిలో రోడ్డు రవాణా సంస్థ అధికారులు, పోలీసులు సంయుక్తంగా లైసెన్సు మేళా నిర్వహించారు.