కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి వద్ద ఉన్న నార్ల తాతారావు థర్మల్ కోల్ ప్లాంట్ సమీపంలో చిరుత సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి సమయంలో కార్మికులు ఇళ్ళకు వెళుతున్న సమయంలో పొదల్లో తిరుగుతున్న చిరుత కనిపించింది. పక్కనే ఉన్న కొండపల్లి ఖిల్లా పరిసర అడవుల నుంచి చిరుత కిందకు వచ్చి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమాచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుత కోసం గాలింపు ప్రారంభించారు. మరోవైపు చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చిరుత సంచారం కలకలం
Nov 22 2017 10:23 AM | Updated on Mar 20 2024 12:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement