మహిళా ఎఫ్‌ఆర్వోపై దాడి.. స్పందించిన కేటీఆర్
సిర్పూర్ కాగజ్‌నగర్‌లో అటవీశాఖ అధికారిణి అనితపై జరిగిన దాడిపై టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మహిళా అధికారిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు కేటీఆర్ ట్విటర్‌లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఉన్న మహిళ అధికారిపై దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణ వ్యవహార శైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని కేటీఆర్ స్పష్టం చేశారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి