కియా మోటార్స్ తరలిపోతుందన్న వార్తలు అవాస్తవమని ఆ సంస్థ స్పష్టం చేసింది. కియా మోటార్స్లో పూర్తి స్థాయి ఉత్పత్తి చేయాలన్నదే తమ లక్ష్యమని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఇండియా) తెలిపారు. పూర్తి నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుత తయారీ పరిశ్రమను తరలించే యోచన లేదని అన్నారు.