లక్ష రూపాయల వ‍్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రైతుల్లో భరోసా పెంచామన్న ముఖ్యమంత్రి అన్నదాతలను అన్నవిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్‌లో రైతన్నలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.