నేడే కన్నడ పోల్
నేడే కన్నడ సంగ్రామం. గెలుపు గుర్రాన్ని అధిరోహించేదెవరో నిర్ణయమయ్యే రోజు. 2600 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యే రోజు. మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్‌ల్లో కన్నడ ఓటరు ఎవరికి పట్టం కడతాడో తేలే రోజు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఈ రోజే జరగనున్నాయి. మొత్తం 224 నియోజకవర్గాల్లో.. వాయిదా పడిన ఆర్‌ఆర్ నగర్, జయనగర మినహా 222 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి