చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసును ఛేదిస్తామని, మరో రెండు, మూడు రోజులు సమయం పట్టోచ్చని కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. సవతి తల్లే చంపేసిందన్నది కేవలం వదంతి మాత్రమేనని, ఆ కోణంలోను విచారణ చేస్తూ గాలింపు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మూడు బృందాలు ఈ కేసును అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నాయని వెల్లడించారు. కుటుంబ వివాదాల నేపథ్యంలో కిడ్నాప్ జరిగిందని భావిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 నిమిషాలకు పాఠశాల నుండి చిన్నారి అపహరణకు గురయిందన్నారు. కొన్ని చోట్ల సిసి కెమెరాలు సరిగా పని చేయకపోవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతోందని డిఎస్పీ తెలిపారు.
చిన్నారి దీప్తిశ్రీ కిడ్నాప్ కేసు ఛేదిస్తాం..
Nov 24 2019 8:50 PM | Updated on Nov 24 2019 8:54 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement