కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు కొద్దిసేపటి క్రితం ముగిశాయి. నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ సమీపంలో ప్రభుత్వ లాంఛనాలతో జైపాల్‌రెడ్డి అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులు, అభిమానుల, పలువురు రాజకీయ నాయకులు కడసారి ఆయనకు అశ్రునయనాలతో నివాళులర్పించారు.