ఎన్నికలు వచ్చినవి కాబట్టే గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ప్రజలను మోసం చేయడానికి వచ్చారని స్థానిక వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. గల్లా జయదేవ్ కేవలం అతిథి ఎంపీ అని, ఐదేళ్ల కాలంలో ప్రజల సమస్యలను ఏమైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. గుంటూరులో జయదేవ్‌ను తాను, మంగళగిరిలో లోకేష్‌ను ఆళ్ల రామకృష్ణారెడ్డి ఖచ్చితంగా ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. ఆర్కే భారీ మెజార్టీతో లోకేష్‌ను మట్టికరిపించడం ఖాయమన్నారు.