ఆర్టీసీ సమ్మె:చివరి ప్రయత్నం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మె:చివరి ప్రయత్నం

Published Wed, Nov 13 2019 7:53 AM

‘సమస్య పరిష్కారమవు తుందని ఆశించాం. నిన్నటి వరకు ఓ మూలన చిన్న ఆశ ఉండేది. కానీ ఎవరూ తగ్గడంలేదు. ఈ పరిస్థితుల్లో సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం 0.001 శాతం కూడా మాకు లేదు. మా మాటకు, మా విశ్వాసానికి ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం భవి ష్యత్తులో లేబర్‌ కోర్టు మాట వింటుం దన్న నమ్మకం కూడా మాకు లేదు. అయినా మా చివరి ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కార్మిక సంఘాలు, ఆర్టీసీ యాజమాన్యాన్ని చర్చల టేబుల్‌ వద్దకు తీసుకొస్తు న్నాం. ఇందుకోసం ముగ్గురు సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తులతో ఓ కమిటీని ఏర్పాటు చేస్తాం. వీరు వివిధ అంశాల్లో ఎంతో అనుభవం కలిగిన వారు. అత్యున్నత న్యాయ స్థానంలో రాజ్యాంగ హోదాలో పని చేశారు. ప్రభుత్వం కనీసం వీరి మాటైనా వింటుందని ఆశిస్తున్నాం. మా వైపు నుంచి చేస్తున్న చివరి ప్రయ త్నం ఇదే. ఈ కమిటీ ఏర్పాటు విష యంలో మీ వైఖరి ఏమిటో రేపటికల్లా చెప్పండి’అని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.