ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ హత్య కేసుకు సంబంధించిన రికార్డులన్నీ విజయవాడ కోర్టులో ధ్వంసమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) హైకోర్టుకు తెలిపింది. ఉమ్మడి హైకోర్టులో కేసు నడుస్తున్నప్పుడే రికార్డులు ధ్వంసమయ్యాయని సిట్ అధికారులు ధర్మాసనానికి తెలిపారు.