అధికార తెలుగుదేశం పార్టీ అరాచకాలు, అక్రమాలు ఆగడం లేదు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్లు అందకుండా టీడీపీ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారు. టీడీపీ సర్కారు పాలనపై ప్రభుత్వ ఉద్యోగుల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వారి ఓట్లు తమకు పడే అవకాశమే లేదన్న నిర్ణయానికి తెలుగుదేశం పార్టీ ముఖ్యులు వచ్చారు.