పెళ్లి కూతురుకి మేకప్ చేయాలంటూ మాయ మాటలు చెప్పి మత్తు మందు చల్లి బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది ఓ కిలాడీ లేడీ. ఈ ఘటన ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఆర్ నగర్‌లోని సోనాబాయి టెంపుల్ ఎదురుగా ఉన్న స్మార్ట్ బ్యూటీ పార్లల్ యజమానురాలు పెళ్లి కుమార్తెకు మేకప్ చేయాలని మాయ మాటలు చెప్పింది. దీనికి వధువు అంగీకరించడంతో ఆమెపై మత్తు మందు చల్లి మూడు తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన జరిగి మూడు రోజులైనా కేసు నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.