అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి–వీరాపురం గ్రామాల మధ్య బసయ్యతోట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ సహా మరో ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ షేక్ ఇబ్రహీం సాహెబ్ ఎన్నికల విధుల్లో భాగంగా మంగళవారం ఉదయం తన సొంత కారులో అనంతపురం వెళ్లారు. ఆయన వెంట మున్సిపల్ ఆర్వో అమీర్‌బాషా, ఆర్‌ఐ దాదా ఖలందర్ తదితరులు ఉన్నారు.