రాష్ట్రంలో పెదబాబు డైరెక్షన్‌లో చినబాబు యాక్షన్‌తో లక్షలాది ఓట్ల తొలగింపునకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది. ప్రతీ జిల్లాలో 90 శాతం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు చినబాబు బృందం స్కెచ్ వేసింది. ఇప్పుడా పథకం వికటించడంతో వారు ఎదురుదాడికి దిగడమే కాకుండా వైఎస్‌ఆర్‌సీపీయే ఓట్ల తొలగింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తోంది. ఇది దొంగే ‘దొంగా దొంగా’ అన్నట్లుగా ఉందని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.