మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు.