రాహుల్‌కు తప్పిన ప్రమాదం | Fire scare at Rahul Gandhi's Jabalpur rally | Sakshi
Sakshi News home page

రాహుల్‌కు తప్పిన ప్రమాదం

Oct 8 2018 9:03 AM | Updated on Mar 20 2024 3:44 PM

కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. లోక్‌ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్‌లో ర్యాలీ నిర్వహిస్తుండగా చిన్నపాటి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వివరాలు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ గాంధీ ఆదివారం(నిన్న) జబల్‌పూర్‌లో 8 కిలో మీటర్ల భారీ రోడ్‌షో నిర్వహించారు. ఇందులో భాగంగా కొంతమంది కార్యకర్తలు మూడు రంగుల బెలూన్లతో రాహుల్‌కు స్వాగతం పలికేందుకు ముందుకొచ్చారు. అదే సమయంలో మరికొందరు కార్యకర్తలు యువనేతకు హారతి ఇవ్వడానికి ముందుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement