హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళుతున్న తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలులో గురువారం ఉదయం మంటలు చెలరేగాయి. హర్యానాలోని బల్లబ్‌గఢ్ వద్ద ఇవాళ ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ సంఘటనలో ఓ బోగీ పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరు చేశారు.