విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బీసెంట్ రోడ్డులోని ఆర్ 900బట్టల షోరూంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో షాపు పరిసర ప్రాంతాల్లో పోగ దట్టంగా వ్యాపించింది. బట్టల షోరూం కావడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఇదే షోరూంకు పక్కన కూడా మరికొన్ని బట్టల షాపులు అనుకుని ఉన్నాయి. మంటలు మరింత వ్యాపిస్తే మిగిలిన షాపులు కూడా ఆహుతయ్యే అవకాశం ఉంది. స్థానికులు సమాచారంతో విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ప్రక్క షాపులకు వ్యాపింకుండా చర్యలు తీసుకుంటున్నారు. కాగా ప్రమాదానికి కారణం ఏంటన్నది తెలిసిరాలేదు.
బట్టల షోరూంలో అగ్ని ప్రమాదం
Dec 6 2019 8:32 AM | Updated on Dec 6 2019 8:39 AM
Advertisement
Advertisement
Advertisement
