తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి సమీపంలోని ఎల్‌ఎస్ ఆటో మొబైల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.100 కోట్ల నష్టం వాటిల్లినట్లు యాజమాన్యం ప్రాధమికంగా అంచనా వేసింది. ఈ ఆటో మొబైల్ కంపెనీలో కారు స్పేర్ పార్ట్స్ తయారీ చేస్తారు. సుమారు 1500 కార్మికులు పని చేస్తున్నారు. శుక్రవారం వేకువజామున 1.30 సమయంలో ప్రమాదం జరిగింది. అప్పుడు 50 మంది కార్మికులు మాత్రమే పనిలో ఉన్నారు. అదృష్టవశాత్తూ ఎవరికీ ప్రమాదం జరగలేదు. కంపెనీ పూర్తిగా కాలిపోయింది. ప్రమాదం షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేక మరేదైనా కారణమా అని కంపెనీ యాజమాన్యం వెల్లడించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తిరువళ్లూరులో భారీ అగ్ని ప్రమాదం
Nov 9 2018 9:53 AM | Updated on Mar 20 2024 3:53 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement