ఎనిమిదో పేలుడుతో కొలంబో విలవిల | Eight explosion rocks Sri Lanka capital | Sakshi
Sakshi News home page

ఎనిమిదో పేలుడుతో కొలంబో విలవిల

Apr 21 2019 3:41 PM | Updated on Apr 21 2019 3:47 PM

వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. విదేశీయులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకూ మొత్తం ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. హోటళ్లు, చర్చిల్లో విదేశీ యాత్రికులే టార్గెట్‌గా ఆత్మహుతి దాడులు జరిగాయి. కొలంబో సహా నెగొంబో, బట్టికలోవా నగరాల్లో ఆదివారం ఉదయం జరిగిన వరుస పేలుళ్లలో వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోగా, పెద్ద ఎత్తున గాయపడ్డారు. వరుస బాంబు పేలుళ్లలో 35మంది విదేశీయులు చనిపోయారు. ఈ పేలుళ్ల వెనుక ఐసిస్‌ హస్తముందని శ్రీలంక ప్రభుత్వం భావిస్తోంది.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement