మద్యం మత్తులో యువతి హాల్‌చల్‌ | Drunken Girl Creates Hulchul in Hyderabad | Sakshi
Sakshi News home page

మద్యం మత్తులో యువతి హాల్‌చల్‌

Apr 8 2018 10:45 AM | Updated on Mar 22 2024 11:27 AM

ఫిల్మ్‌ నగర్‌లో ఓ యువతి మద్యం మత్తులో హాల్‌చల్‌ చేసింది. పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాక ఆ యువతి కారు దిగి పోలీసులు, మీడియాపై రాళ్లతో దాడి చేసింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకుంది. వివరాలివి.. నగరంలో ఫిల్మ్‌నగర్‌ సహా ఏడు ప్రాంతాల్లో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించారు. తాగి డ్రైవింగ్‌ చేస్తున్న మందుబాబులను పోలీసులు పట్టుకున్నారు. దాదాపుగా 80 కేసులు నమోదు అయినట్లు ట్రాఫిక్‌ ఏసీపీ వెంకటరమణ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement