ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..! | Dilsuknagar, Man Murder Attempt On Girlfriend | Sakshi
Sakshi News home page

ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!

Jul 9 2019 3:53 PM | Updated on Mar 20 2024 5:16 PM

చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలి గొంతుకోసి హత్యాయత్నం చేశాడో వ్యక్తి. ఈ ఘటన దిల్‌సుఖ్‌నగర్‌లోని బృందావన్‌ లాడ్జిలో జరిగింది. మంగళవారం ఉదయం నెల్లూరుకు చెందిన వెంకటేష్‌ అనే యువకుడు లాడ్జిలో రూమ్‌ అద్దెకు తీసుకున్నాడు. కాగా, మధ్యాహ్న సమయంలో ఆ రూమ్‌లో ప్రవీణ్‌ అనే వ్యక్తి తనతోపాటు ఉన్న ప్రియురాలి గొంతుకోశాడు. అనంతరం తానూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. చైతన్యపురి పోలీసులు విచారణ జరుపుతున్నారు. అమ్మాయి హైదరాబాద్‌లోని బడంగ్‌పేటకు చెందిన మనస్విని (22)గా పోలీసులు గుర్తించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement