ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 177వరోజు పాదయాత్రను పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శివారు(నైట్ క్యాంప్) నుంచి వైఎస్ జగన్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. అక్కడి నుంచి చిట్టివరం క్రాస్, రాజోల్ క్రాస్, దిగమర్రు, పెద్ద గరువు క్రాస్ చేరుకుని రాజన్న బిడ్డ భోజన విరామం తీసుకుంటారు. విరామం అనంతరం పాలకొల్లు, ఉల్లంపూరు వరకూ వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగుతుంది. అనంతరం జననేత రాత్రికి అక్కడే బస చేస్తారు