ఆ జాకెట్‌ 70వేలా.. 700లకే కొనిస్తా! | Congress reaction on Rahul Gandhi 70k jacket | Sakshi
Sakshi News home page

ఆ జాకెట్‌ 70వేలా.. 700లకే కొనిస్తా!

Jan 31 2018 3:52 PM | Updated on Mar 21 2024 10:56 AM

మోదీ సర్కారుపై ‘సూటు-బూటు’ సర్కారు అంటూ విమర్శలు చేసే రాహుల్‌ గాంధీ ఏకంగా రూ. 70వేలు ఖరీదు చేసే జాకెట్‌ను తొడుక్కున్నారని బీజేపీ చేస్తున్న విమర్శలను కాంగ్రెస్‌ పార్టీ తోసిపుచ్చింది. రాహుల్‌ జాకెట్‌ విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శలను తేలికగా కొట్టిపారేసింది. ఆ జాకెట్‌ రూ. 70 వేలు.. రూ. 700లకు సైతం దొరుకుతుంది.. కావాలంటే ప్రధాని మోదీకి కొనిస్తామని వేలాకోళం చేసింది.

రాహుల్‌ ఖరీదైన జాకెట్‌ వేసుకున్నారని బీజేపీ చేస్తున్న ఆరోపణలపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత రేణుకా చౌదరీ ఈ మేరకు స్పందించారు. బీజేపీ ఆరోపణలపై మీడియా ప్రశ్నించగానే.. రేణుక అమాంతం నవ్వేశారు. బీజేపీ నిస్పృహకు ఈ  ఆరోపణలు అద్దం పడుతున్నాయని, కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో వెతికి.. ఇలా రేట్లు ఊహించుకుంటున్నారని విమర్శించారు. అదే జాకెట్‌ రూ. 700లకే దొరుకుతుందని, కావాలంటే ప్రధాని మోదీకి పంపిస్తామని, 56 ఇంచుల ఛాతి అంటూ పేర్కొనే మోదీ కొలతలు తమకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement