మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్, సురేశ్‌రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. 1989 నుంచి అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, సురేశ్ రెడ్డిలు మంచి స్నేహితులని, ఇరువురు కలిసి శాసన సభలో పనిచేశారని, పరస్పర అభిప్రాయాలు పంచుకున్నారని గుర్తు చేశారు.