దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తీసుకొస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఇంగ్లీష్ విద్య వద్దంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను సీఎం జగన్ గురువారం శాసనసభలో ప్రస్తావించారు. ఇంగ్లీష్ చదువులు పేదవారికి అందకుండా ఓ వర్గం యుద్ధం చేస్తోందన్న సీఎం జగన్.... ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు సబ్జెక్ట్‌ను ఎత్తివేస్తున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.