సాక్షి, అమరావతి : విజయవాడ బందరు కాలువలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను రక్షించిన రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు అర్జునరావును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ఆయన సాహసాన్ని ప్రశంసించారు. ప్రస్తుతం సీఎం జగన్ కాన్యాయ్ పైలెట్ ఆపీసర్‌గా విధులు నిర్వహిస్తున్న అర్జున రావు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి లైఫ్ సేవింగ్ మెడల్‌కు రికమెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఎస్సై అర్జునరావుపై సీఎం జగన్ ప్రశంసలు
Dec 3 2019 6:23 PM | Updated on Dec 3 2019 7:10 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement