ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా పూర్తయ్యేలా సహకరించాలని ఏ రాజకీయ పార్టీ అయినా తన ఏజెంట్లకు సూచిస్తుంది. అధికారం కోల్పోతున్నామనే నిస్పృహతో టీడీపీ మాత్రం కౌంటింగ్ సమయంలో గిల్లికజ్జాలకు సిద్ధమవుతోంది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి విషయంలోనూ ఘర్షణ వైఖరి అనుసరించాలంటూ టీడీపీ తన ఏజెంట్లకు నూరిపోస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.