పెట్టుబడుల కోసం పాక్‌ ‘బెల్లీ డ్యాన్స్‌’

రోజు రోజుకు అప్పుల్లో కూరుకుపోతున్న పాకిస్తాన్‌ తమ దేశంలో పెట్టుబడుల కోసం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి చేసిన ఓ ప్రయత్నంతో తాజాగా తీవ్ర విమర్శలకు గురైంది. పాకిస్తాన్‌కు చెందిన సర్హాద్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎస్‌సీసీఐ) ఓ పెట్టుబడి సదస్సును అజర్‌బైజాన్‌ దేశ రాజధాని బకూలో నిర్వహించింది. ఖైబర్‌ పక్తుంఖ్వా పెట్టుబడి అవకాశాల సదస్సు పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సెప్టెంబర్‌ 4 నుంచి 8 మధ్య జరిగింది. అయితే అక్కడికి వచ్చిన పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఈ కార్యక్రమంలో బెల్లీ డాన్స్‌ను ఏర్పాటు చేసింది. ఏదైనా దాగదుగా అన్నట్లు దీనిని పాక్‌లోని ఓ జర్నలిస్టు వీడియోతో సహా ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top