లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటుకోసం సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆరో రోజులపాటు చేపట్టిన నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. కేంద్రంలో లోక్‌పాల్, రాష్ట్రాల్లో లోకాయుక్తలను త్వరలోనే ఏర్పాటుచేస్తామని ప్రభుత్వం తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హామీ ఇవ్వడంతో ఆయన దీక్షను ముగించారు.