టీవీ యాంకర్ ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 ఏళ్లు రద్దు చేయడంతో పాటూ రూ. 2100 జరిమానా విధించింది. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు విచారణ నిమిత్తం ప్రదీప్ తండ్రితో కలిసి శుక్రవారం నాంపల్లి కోర్టుకు హాజరయ్యాడు. డ్రంక్ డ్రైవ్ చేయకూడదని ఇదివరకు ప్రచారం కూడా చేశావు, అలాంటిది తెలిసి ఎలా తప్పు చేశారని ప్రదీప్‌ను కోర్టు ప్రశ్నించింది. తప్పు జరిగిపోయింది అని ప్రదీప్ అంగీకరించారు. ఊహంచని విధంగా కోర్టు తీర్పు వెలువరించడంతో ప్రదీప్ ఖిన్నుడయ్యారు.
Jan 19 2018 3:44 PM | Updated on Mar 21 2024 8:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement