యంత్రాలతో ఎంత సౌలభ‍్యం ఉందో, ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. ఒక్కోసారి అంతే ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. ఏదైనా తేడా వస్తే..వచ్చే తిప్పలు అనుభవించినవారికి మాత్రమే అర్దమౌతాయి. తాజాగా ఇలాంటి వీడియో నొకదాన్ని ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు. తరచూ ఇన్నోవేటివ్ ఐడియాలు, స్టోరీలను ట్విటర్‌లో తన ఫాలోయిర్స్‌కు షేర్ చేసే ఆయన ఈసారి అలెక్సా వాయిస్ అసిస్టెంట్ గురించి ట్వీట్ చేశారు. అలెక్సాను ఆహ్వానించాలంటే ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే అంటూ సరదాగా కామెంట్ చేశారు. వాయిస్ కమాండ్స్ ఆధారంగా పనిచేసే అలెక్సాతో ఒక యువకుని కష్టాలు ఈ వీడియోలో చూడొచ్చు. అయ్యో పాపం... అనిపించినా.. కాసేపు పొట్టచెక్కలవ్వడం కాయం..