అంబర్ పేట్: పెళ్లి వేడుకలో విషాదం

నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. అంబర్‌పేటలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో గోడకూలి నలుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే గోల్నాక పెరల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఉదయం వివాహం జరుగుతుండగా వేదిక వెనుక ఉన్న గోడ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ సహా నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మలక్‌పేట యశోదా ఆస్పత్రికి తరలించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top