ప్రభుత్వ ఐటీఐలో జిల్లా స్థాయి ట్రైనింగ్ ఆఫీసర్ గా పని చేస్తున్న కోనేరు శ్రీనివాస్ కుమార్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ నగరంలోని గురునానక్ కాలనీ, విజయనగర్ కాలనీల్లోని శ్రీనివాస్ కుమార్ నివాసాల్లో జరిపిన తనిఖీల్లో భారీగా నగదు, బంగారం బయటపడింది.