టై తో 9వ తరగతి విద్యార్థి ఉరి... | 9th class student commits suicide at kadapa | Sakshi
Sakshi News home page

టై తో 9వ తరగతి విద్యార్థి ఉరి...

Dec 12 2017 9:34 AM | Updated on Mar 20 2024 3:53 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా కడపలో విషాదం చోటుచేసుకుంది. నగర శివారులోని మాంట్ ఫోర్ట్ ప్రయివేట్‌ స్కూల్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 9వ తరగతి చదువుతున్న చరణ్‌ రెడ్డి అనే విద్యార్థి టైతో ఉరి వేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. అయితే విద్యార్థి ఆత్మహత్యపై స్కూల్‌ యాజమాన్యం గోప్యంగా ఉంచింది. చరణ్‌ రెడ్డి తల్లిదండ్రులతో పాటు, పోలీసులకు సమాచారం అందించలేదు. హడావిడిగా మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై విద్యార్థి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం అందుబాటులోకి లేకపోవడంపై చరణ్‌ రెడ్డి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement