ఉదయం నుంచి మేఘాలు కమ్ముకునే ఉన్నాయి. ఎండ జాడే లేదు. తుపాను ప్రభావం ప్రారంభమైనట్టు ఉంది. అయినా భారీగా జనం నా అడుగులో అడుగు వేశారు.శ్రీకాకుళానికి చెందిన ఓ మహిళా స్వచ్ఛంద సంస్థ సభ్యులు కలిశారు. ‘సంవత్సరాల తరబడి స్కూల్ యూనిఫామ్ కుడుతున్నాం.. ఇప్పుడేమో ఈ ప్రభుత్వం మా కడుపులు కొడుతోంది.. మేము ఎలా బతకాలి’ అంటూ మొరపెట్టుకున్నారు. దాదాపు వంద మందికి పైగా మహిళలు ఆ సంస్థలో ఉన్నారట. ‘బట్టలు కుడితే ఇచ్చే రూ.40లో రూ.10 ఆప్కో చైర్మన్‌కు లంచం ఇచ్చుకోవాల్సి వస్తోంది.. ఆ మిగతా డబ్బు కూడా సంవత్సరం పైగా చెల్లించకపోతే మా పరిస్థితి ఏం కావాలి?’ అంటూ ఆ అక్కచెల్లెమ్మలు బావురుమన్నారు. ‘ఈ పాలనలో ఆప్కో సంస్థ అక్రమాల పుట్టగా మారిపోయింది.. బడిపిల్లలకు ఉచిత యూనిఫామ్ పథకం అధ్వానంగా తయారైంది.. విద్యా సంవత్సరం పూర్తవుతున్నా యూనిఫామ్ పూర్తిగా స్కూళ్లకు అందడం లేదు.. అరకొరగా ఇచ్చినవి కూడా నాసిరకమైనవే.. కొలతలు సరిగా లేనివి. ఓవైపు విద్యార్థులు వాటిని వేసుకోలేక మూలనపడేస్తుంటే.. మరోవైపు చాలీచాలని కొలతలతో కుట్టినవి వేసుకుంటూ విద్యార్థినులు సిగ్గుతో చితికిపోతున్నారు. అసలీ పథకం ఎవరి కోసం?’ అంటూ ఆ మహిళా సంఘం సభ్యులు మండిపడ్డారు. పేద పిల్లల స్కూల్ యూనిఫామ్ పథకాన్ని సైతం దోపిడీమయం చేసిన ఆప్కో చైర్మన్, సంబంధిత మంత్రి, ప్రభుత్వ పెద్దలే ఈ పథకం అసలైన లబ్ధిదారులంటూ చెప్పుకొచ్చారు.
322వ రోజు పాదయాత్ర డైరీ
Dec 17 2018 7:30 AM | Updated on Dec 17 2018 7:34 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement