పైన ఈ వీడియోలో హిందూపురం సీఐ రాజగోపాల్ నాయుడు రాష్ట్ర బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు శివరామకృష్ణ గారిని ఉద్దేశిస్తూ అమర్యాదగా,పచ్చి భూతులు తిడుతూ, కాలర్ పట్టుకొని, బూట్లు కాలుతో తన్నడం చూస్తున్నాము..
హిందూపురం పట్టణంలో సోమవారం రాత్రి సుమారు 10 గంటల సమయములో మాతృ శ్రీ ప్రైవేట్ ఆసుపత్రిలో పురిటి నొప్పులతో ఆసుపత్రిలో చేరిన పరిగి మండలం భిచగానిపల్లి గ్రామానికి చెందిన రమ్య శ్రీ అనే మహిళ.అయితే కాన్పు సమయంలో సుజిరిన్ చేసిన తరువాత రమ్య శ్రీ అనే మహిళ చనిపోవడం జరిగినది.
రమ్య శ్రీ భర్త మరియు బంధువుల ఫోన్ ద్వారా జరిగిన విషయం బహుజన చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మరియు హై కోర్టు అడ్వకేట్ అయిన శివరామకృష్ణ గారికి తెలియజేయడం జరిగినది.
హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లిన తర్వాత శివరామకృష్ణ గారు రమ్యశ్రీ అనే మహిళ మాతృ శ్రీ అనే ప్రైవేట్ ఆసుపత్రిలో చనిపోతే,ఆ విషయం దాచి పెట్టీ ఎందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారూ అని ప్రశ్నిస్తూన్న సమయంలో అక్కడికి చేరుకున్న సదరు సీఐ రాజగోపాల్ నాయుడు వచ్చి రాగానే వ్రాయలేని భాషలో తిడుతూ బూట్ల కళ్ళతో దాడి చేయడం జరిగినది....
సిఐ రాజగోపాల్ నాయుడు ఎలాగైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రైవేట్ ఆసుపత్రి వారితో లోపాయికారి ఒప్పందం పెట్టుకొని ఇలా చేయడం జరిగినది అని దళిత బహుజన నాయకులు చర్చించకోవడం జరిగినది....
దళిత బహుజన నాయకులరా ఇప్పటికైనా రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకం అయ్యే సమయం ఆసన్నమైంది...
ఈ రోజు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ గారికి దళిత బహుజన నాయకులు అందురు కలిసి వ్రాత పూర్వకముగా పిర్యాదు చేయడం జరిగినది. న్యాయం జరగని పక్షంలో ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా త్వరలో కార్యాచరణ ప్రకటిస్తాం....
ఇట్లు
బహుజన చైతన్య వేదిక స్టేట్ టీం.....
