టిల్లు స్క్వేర్‌: శ్రీసత్యకు అన్యాయం! | Sakshi
Sakshi News home page

టిల్లు స్క్వేర్‌: సిద్ధుతో శ్రీసత్య నటించిన సీన్స్‌ ఎక్కడ?

Published Tue, Apr 2 2024 2:18 PM

Tillu Square: Sri Satya Scenes Deleted?

తల్లిని మించి దైవమున్నదా...? శ్రీసత్య కూడా ఇదే అనుకుంది. తనను కనిపెంచిన అమ్మ మంచాన పడి ఉంటే తట్టుకోలేకపోయింది. ఎవరినో ప్రేమించి, మోసపోయిన శ్రీసత్య చావు అంచులదాకా వెళ్లి తల్లి కోసం బతికొచ్చింది. అమ్మకు మంచి వైద్యం చేయించాలనుకుంది. అందుకనే సీరియల్స్‌, షోలు, వెబ్‌ సిరీస్‌లు.. ఏవి వచ్చినా చేసుకుంటూ పోయింది. అలా బిగ్‌బాస్‌ అవకాశాన్ని కూడా వాడుకుంది.

తెలుగు బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌లో పాల్గొంది. తర్వాత పెద్దగా కనిపించడమే లేదు. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూకు హాజరైన బ్యూటీ.. టిల్లు స్క్వేర్‌లో మంచి పాత్ర చేస్తున్నట్లు తెలిపింది. సిద్ధు జొన్నలగడ్డతో మంచి సన్నివేశాలున్నాయని, ప్రాధాన్యత ఉన్న పాత్ర చేస్తున్నానంది. డైలాగ్స్‌ చెప్పేటప్పుడు మొదటిరోజు కాస్త టెన్షన్‌ పడ్డానని, తర్వాత మామూలుగా చెప్పేశానంది. కట్‌ చేస్తే నాలుగు రోజుల క్రితమే టిల్లు స్క్వేర్‌ రిలీజైంది.

సినిమాలో ఒక పాట మినహా ఎక్కడా శ్రీసత్య కనిపించలేదు. ఆ పాటలో కూడా బ్యాగ్రౌండ్‌ డ్యాన్సర్లలో ఒకరిగా సెకనుపాటు మెరిసిందంతే! అంటే శ్రీసత్య సీన్లు డిలీట్‌ చేశారని అర్థమవుతోంది. ఇది చూసిన అభిమానులు శ్రీసత్యకు అన్యాయం చేశారని ఫీలవుతున్నారు. సిద్ధు- శ్రీసత్యల సన్నివేశాలు ఉంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు.