కాకుమాను మృతి కూటమి సర్కారు చేయించిన హత్యే | Chintalapudi Ashok Kumar Comments On Kakumanu Rajasekhar Lost Breath | Sakshi
Sakshi News home page

కాకుమాను మృతి కూటమి సర్కారు చేయించిన హత్యే

Sep 24 2026 11:23 PM | Updated on Sep 24 2026 11:23 PM

- డీఎస్సీలో అక్రమాలపై నిరసనలో పోలీసుల దాడితోనే ఆయనకు అస్వస్థత
- వైఎస్సార్‌సీపీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌

అద్దంకి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్‌ ఆకస్మిక మరణంపై డాక్టర్‌గా తనకు అనుమానాలున్నాయని ఆ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌ చింతలపూడి అశోక్‌ కుమార్‌ తెలిపారు. గురువారం విడుదల చేసిన ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. చాలా యాక్టివ్‌గా ఉన్న రాజశేఖర్‌ అకస్మాత్తుగా మృతి చెందడానికి కూటమి ప్రభుత్వం పోలీసులతో చేయించిన దాడే కారణమని చెప్పారు. డీఎస్సీలో అక్రమాలపై మంగళవారం విజయవాడలో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ధర్నాలో పోలీసులు ఆయన్ని కిందపడేసి తన్నడం, గేటుకేసి ఒత్తారని, అందువల్లే గుండెల్లో ఇబ్బందితో మృతిచెందారని ఆరోపించారు. ఆయన ఆరోజే ఇబ్బందిగా ఉందని వైద్యుడిని సంప్రదించారని ఆయన వెంట ఉండే నాయకులు చెప్పారన్నారు. ధర్నాలో ఫొటోలు, వీడియోలు చూసిన తరువాతే తాను ఈ విషయం చెబుతున్నట్లు తెలిపారు. ఇది ముమ్మాటికీ రెడ్‌బుక్‌ రాజ్యాంగంలో భాగంగా పోలీసుల చేత కూటమి ప్రభుత్వం చేయించిన హత్యేనని ఆరోపించారు. ఇక నుంచైనా వైఎస్సార్‌సీపీ నాయకులపై కూటమి సర్కారు దాడులు మానుకోవాలన్నారు. రాజశేఖర్‌ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

Related Videos By Category

Advertisement
 
Advertisement
Advertisement