కొత్తగా బయటకు వచ్చిన కరడుగట్టిన ఉగ్రవాది వీడియో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. గత నెలలో శ్రీనగర్ ఆస్పత్రి నుంచి తప్పించుకుపోయిన పాకిస్థాన్ ఉగ్రవాది నవీద్ జట్ తాజగా ఆ వీడియోలో కనిపించాడు. అది కూడా జమ్ముకశ్మీర్‌లో ప్రభావం ఉన్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సమీర్ టైగర్ మరో ఐదుగురితో కలిసి ఉండి. దీని ప్రకారం పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలతో కలిసి హిజ్బుల్ ముజాహిదీన్ కలిసి పనిచేస్తుందని మరోసారి స్పష్టమైంది.