అందాలు ఆరబోద్దామనే అత్యుత్సాహంలో..

ఓ మోడల్‌ అత్యుత్సాహం ప్రాణం మీదకు తెచ్చింది. తాను ధరించిన వినూత్న వస్త్రాలను ప్రదర్శించేందుకు ర్యాంప్‌పై ముందుకెళ్లిన మోడల్‌ అలంకరణకు నిప్పు అంటుకోవడంతో క్షణాల్లో భయానక వాతావరణం అలుముకుంది. కళ్లుమూసి తెరిచేలోగా మంటలు ఆమె తలపై డిజైన్‌ చేసిన ప్రత్యేక అలంకరణను కాలి బూడిదైంది.

నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి మంటలు ఆర్పడంతో ఆమె స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటన ఎవన్‌ సాల్వడోర్‌లో చోటుచేసుకుంది. ర్యాంప్‌ చివర్లో చేతిలో దివిటీలతో కొంతమంది వ్యక్తులను ఆకర్షణగా పెట్టడంతో వారి చేతుల్లోని నిప్పు కాస్త ఆమె డిజైన్‌కు అంటుకోవడంతో ఆ ప్రమాదం సంభవించింది. ఆ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు 

Read also in:
Back to Top