దేశంలోని ఏరాష్ట్రం కూడా ఆటో డ్రైవర్లను గుర్తించలేదని కానీ మన ముఖ్యమంత్రి వారి కష్టాలను తెలుసుకొని ఇచ్చిన మాట ప్రకారం పదివేల రూపాయలను వారి ఖాతాల్లో వేసారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్‌జిల్లాలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా 8536 మంది డ్రైవర్లకు ఆర్ధిక సహాయం విడుదల చేశారని వెల్లడించారు. ప్రభుత్వం తరపున మొట్టమొదటి కార్యక్రమంగా వైఎస్సార్ వాహనమిత్ర నిలవడం సంతోషకరమనం వ్యాఖ్యానించారు. త్వరలో అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలను అందించబోతున్నామని తెలిపారు. గత పాలన మొత్తం అవినీతి, అక్రమాలకు నిలయంగా మారిందని విమర్శించారు.
Oct 4 2019 7:55 PM | Updated on Oct 4 2019 7:59 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement