సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలోని వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్‌ని శుక్రవారం తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేశారు రామ్ గోపాల్ వర్మ. పేరుకు తగ్గట్టే పాట ఫస్ట్‌లుక్‌లో ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును, ఇతర నాయకులను, వెన్నుపోటుకు వేదికగా నిలిచిన వైశ్రాయ్ హోటల్‌ను చూపించారు.