యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కాంబినేషన్‌లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్ర షూటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన వివరాలను రాజమౌళి ట్విటర్‌లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో కలిసి దిగిన ఫొటోను ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.