‘ఒకసారి చూస్తే చాలు.. ఒకసారి నవ్వితే చాలు.. ఒక అడుగు నాతో వేస్తే చాలు.. ఒక రిప్లై ఇస్తే చాలు.. ఒక స్మైలీ పెడితే చాలు.. ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు.. నాతో నువ్వుంటే చాలు.. కోరుకోను ఇంకేం వరాలు’అంటూ సాగే ఈ పాట లవర్స్‌కు బాగా కనెక్ట్ అవుతోంది. అంతేకాకుండా వాట్సప్ స్టేటస్, కాలర్ ట్యూన్, రింగ్ ట్యూన్స్‌లలో ఈ పాట మార్మోగటం ఖాయంగా కనిపిస్తోంది. తెలుగులో లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా పేరు గాంచిన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ పాటకు ట్యూన్ కట్టగా.. చంద్రబోస్ లిరిక్స్‌ను అందించాడు. ఈ పాటకు వీరిద్దరు ఒకెత్తయితే అద్నాన్ సమీ వాయిస్ ఈ పాటకు మరింత హైలెట్‌గా నిలిచింది. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ నటిస్తోన్న ‘90 ఎం.ఎల్’ సినిమాలోని మరో లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.